Friday, April 1, 2016

ఇక నుంచి క్షణాల్లో రెజ్యుమె .

చదువు పూర్తి అయ్యాక ఉద్యోగం కావాలనుకోవడం సాధారణం , ఐతే ఉద్యోగానికి ముఖ్యంగా రెజ్యుమె చాలా కీలక పాత్ర పోషిస్తుంది . ఈ రెజ్యుమే లు చాలా రకాలుగా మనం చూస్తుంటాo . ఎక్కడా ఆధారపడాల్సిన అవసరం లేకుండా మనమే రెజ్యుమే ని క్రియేట్ చేయడానికి వీలుగా ఒక సైట్ ఉంది , అదే www.resyum.com. ఈ సైట్ హోం పేజీ లో నే రెజ్యుమే ఉంటుంది . మన వివరాలు ఇస్తే క్షణాల్లో రెజ్యుమె తయారవుతుంది . అంతే కాక ఈ రెజ్యుమే ను మనం సేవ్ కూడా చేసుకోవచ్చు . మనం ఎలాంటి రెజ్యుమే చేస్తే బాగుంటుందో చెప్పడానికి TIPS ఆప్షన్ కుడా అందుబాటులో ఉంది .


Thursday, March 31, 2016

అన్ లైన్ లో నే PDF ల ను ఎడిట్ చేయాలంటే .....

ఇంటర్నెట్ వాడుతున్న వారికి PDF చాలా అవసరo .  డౌన్లోడ్ చేయకుండా , ఏవి ఇన్ స్టాల్ చేయకుండా ఆన్ లైన్ లో నే  PDF ను ఎడిట్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి  , ప్రస్తుతానికి  గూగుల్ డ్రైవ్ లో ఎలా అంటే  ......

గూగుల్ డ్రైవ్ లో ఇంతక ముందే ఉన్న ఫైల్స్ ని ఎడిట్ చేయాలంటే , అందుకు PDF ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి  Open with ని సెలెక్ట్ చేస్తే , డిఫాల్ట్ గా అందుబాటులో ఉన్న సాఫ్ట్ వేర్ లు మనకు కనపడతాయి  . వాటిలో ఒక దాన్ని సెలెక్ట్ చేస్తే మన పని అవుతుంది . PDF లో ఉన్న టెక్స్ట్ ని , ఇమేజ్ ని ఇలా ఏదైనా ఎడిట్ చెయ్యొచ్చు . ఇవే కాక Open with  క్రింద More apps ని సెలెక్ట్ చేస్తే క్రోమ్ వెబ్ స్టోర్ లో ఉండే మరిన్ని వాటిని మనం వాడుకొవచ్చు.

వాటిలో ముఖ్యమైనవి XoDo PDF , Notable PDF , PDF Split ఎక్కువ పజీలు ఉన్నప్పుడు మరియు ఆన్ లైన్  లో ఉన్నవే కాక సిస్టం లో ఉన్నవాటిని కుడా అప్ లోడ్ చేసి ఎడిట్ చెయవచ్చు.

                   

                  

కనెక్ట్ చేయకుండానే ఈ USB డ్రైవ్ ని వాడొచ్చు .

మన అందరికీ USB డ్రైవ్ తో చాలా పని ఉంటుంది . అయితే సాధారణంగా వీటిని ఏదైనా ఒక సిస్టం కు  కానీ OTG కేబుల్ కు కనీ కనెక్ట్ చేయాల్సిందే . అదే మనం ఆ USB డ్రైవ్ ని దేనికి కనెక్ట్ చేయకుండా మన  ఉంచుకొని అది వైర్ లెస్ పద్దతి లో కనెక్ట్ అవుతే , చాలా బాగుంటుంది కదా .  అలంటి ఆలోచన తో మార్కెట్ లో కి వచ్చిందే Sandisk Connect Wireless Stick . దీన్ని వైఫై నెట్ వర్క్ ద్వారా పిసి , ఫోన్ , ట్యాబ్ ల కు కనెక్ట్ చేయవచ్చు . డేటా ట్రాన్సఫెర్ చాలా సులభంగా త్వరగా అవుతుంది .  ఇందులో డేటా ని ఒకేసారి 3 పరికరాలకు షేర్ చేయవచ్చు .
ఈ డ్రైవ్ మార్కెట్ లో వరుసగా 16 , 32 , 64 , 128 , 200  జీబీ వరకు  అందుబాటులో ఉంది . 

మరిన్ని వివరాలకు  http://goo.gl/MRKe1a లింక్ లో చూడొచ్చు .

Tuesday, March 29, 2016

పత్రికల్ని ఉచితంగా చదవాలి అంటే .

ఈ - బుక్స్  చదవడానికి చాలానే వెబ్ సైట్ లు ఆప్ లు ఉన్నాయి , అయితే నెలకోసారి , వారానికోసారి వచ్చే పత్రికల్ని చదవాలంటే ......?
 www.zinio.com - ఈ సర్వీస్ సేవల్ని ఉచితంగా పొందచ్చు . ఆప్ మరియు వెబ్ సైట్ రూపo లో అందుబాటులో ఉంది .ఈ ఆప్ ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు .
 ప్రపంచం లో నే అతిపెద్ద న్యూస్ స్టాండ్ గా దీనికి పేరుంది .
దాదాపు అన్ని మగజైన్ ల వివరాలు మనకు చూపుతుంది .

మీరు రాసిన లిరిక్స్ మీకే వినపడాలంటే .

మీకు బాగా ఇష్టమైన వీడియో కి మీరు రాసిన లిరిక్స్ ని జత చేయాలంటే ఇంటర్నెట్ లో చాలా కమర్షియల్  సాఫ్ట్ వేర్ లు ఉన్నాయి కానీ సింపుల్ టెక్నిక్స్ తో పని ముగించాలి అనుకుంటే Jolify ఉచిత వెబ్ సర్వీస్ గురించి తెలుసుకోవాల్సిందే . టెక్స్ట్ స్టైల్ ని మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు . మీ లిరిక్స్ ని అప్ లోడ్ చేయడానికి Settings లో కి వెళ్లి Upload audio ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది .

మరిన్ని వివరాలకు www.jolify.com


Monday, March 28, 2016

ఆన్ లైన్ లో మెడికల్ రిపోర్ట్ లు.

మనకు దగ్గరి వారందరూ ఆరోగ్యంగా ఉండాలనుకోవడం సహజం . ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇల్లంతా పాత రిపోర్ట్ లు ఎక్కడున్నాయని వెతుకులాట . అదే మీకు సంబందించిన మెడికల్ రిపోర్ట్ లు అన్ని ఒకే చోట ఆన్లైన్ లో ఉంటే బాగుంటుంది కదా . అలా వచ్చిందే eKincare సర్వీసు . దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం .
మీకు సంబందించిన మెడికల్ రిపోర్ట్ లు అన్ని ఒకే చోట ఇక్కడ పొందుపరచవచ్చు . చిటికెలో ఎక్కడైనా మీరు మీ రిపోర్ట్ లను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు . ఈ సర్వీసు ని వాడేందుకు ముందుగా సభ్యులు అవ్వాలి . మీ సభ్యత్వం పూర్తి అయ్యాక మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఒక స్టేటస్ రూపమ్ లో చూపుతుంది . ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు ఏం చెయ్యాలో కుడా సూచిస్తుంది . మనవే కాకుండా మన దగ్గరి వారి వివరాలు కుడా పొందుపరచవచ్చు . అందుకు Add Family Member ఫై క్లిక్ చెయ్యాలి. మీ రిపోర్ట్ లను అప్ లోడ్ చేసేందుకు Documents విభాగం లో కి వెళ్ళాలి . మీకు అవసరం అయితే అనారోగ్య సమస్యల ఫై నిపుణుల సలహాల్ని కుడా తీసుకోవచ్చు . ఇవే కాక డిస్కౌంట్ ల తో కూడిన ఆఫర్ ల తో మెడికల్ పరీక్షల్ని బుక్ చేసుకోవచ్చు . 
ఇలాంటి అప్ మన దగ్గర ఉంచుకోవడం చాలా అవసరం .   


ఒపేరా మిని కొత్త అప్ డేట్ .

ఫోన్ లో ఇంటర్నెట్ స్వరూపాన్ని మార్చేసిన ఒపేరా మిని కొత్త గా అప్ డేట్ అయింది . దాదాపు 13 భాషలను సపోర్ట్ చేసే విధంగా ఈ కొత్త బ్రౌసర్ ని అప్ డేట్ చేశారు . ఇందులో మన తెలుగు కుడా ఉండడం విశేషం . ఇక ఫై తెలుగు లో నే మొబైల్ ఒపేరా లో బ్రౌస్ చేయవచ్చు . 
మన తెలుగు తో పాటు కన్నడ , అస్సామీ , బెంగాలీ , గుజరాతీ , మలయాళం , మరాటి , ఒరియా, పంజాబీ , తమిళం , ఉర్దూ , హిందీ భాషలు ఉన్నాయి . 
ఈ బ్రౌసర్ లో మరొక  ముఖ్యమైన అప్ డేట్  ఏంటంటే QR CODE ని రీడ్ చేయాలన్నా , జనరేట్ చేయాలన్నా చాలా సులభంగా చేయవచ్చు .